
తెలుగులో అఖిల్? హిందీలో అర్జున్ కపూర్?
‘అఖిల్’ సినిమాతో లవర్‌బోయ్‌గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తన రెండో సినిమాలో గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ చేస్...
‘అఖిల్’ సినిమాతో లవర్‌బోయ్‌గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తన రెండో సినిమాలో గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది? కచ్చితంగా అది ఫ్యాన్స్‌కు పండగే. ప్రస్తుతం ఇదే ఫిలిమ్‌నగర్‌లో హాట్‌టాపిక్‌గా న డుస్తోంది. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘ఓకే బంగారం’తో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా న టించిన ఓ చిత్రం మలయాళ నాట సంచలనం రేపుతోంది. అదే ‘కమ్మటి పాడమ్’.
ఇప్పటివరకూ తాను చేసిన లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలకు భిన్నంగా దుల్కర్ సల్మాన్ పూర్తి రఫ్ అండ్ టఫ్ లుక్‌లో నటించిన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. రాజీవ్ రవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. తెలుగు రీమేక్‌లో అఖిల్, హిందీ రీమేక్ కోసం అర్జున్ కపూర్ల పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం.