breaking news
Full length action role
-
హాలీవుడ్ పిలుపొచ్చింది!
గత పదేళ్లుగా హాలీవుడ్‌కు ఇండియన్ మార్కెట్లో క్రేజ్ బాగా పెరిగింది. మరోపక్క ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్టామినా కూడా రెట్టింపయింది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ మార్కెట్‌కు మరింత దగ్గరవ్వాలని హాలీవుడ్ పెద్ద స్టూడియోలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడి స్టార్స్‌తో హాలీవుడ్ సినిమాలు నిర్మించాలన్న ఆలోచనలు చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇక్కడ ముందు వరుసలో ఉంటున్నాడు. హృతిక్ ఆరడుగులు ఉంటాడు. సిక్స్‌ప్యాక్ బాడీ. చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడని పేరు. ఆ పేరుకు తగ్గట్టే ఆయన చేసిన ‘క్రిష్’ తరహా సూపర్ హీరో సినిమాలు కూడా హాలీవుడ్‌ను తలపిస్తాయి. ఇంకేం! హృతిక్ హాలీవుడ్ హీరో అయిపోవచ్చని చాలామంది బాలీవుడ్ నిర్మాతలు అనేసుకున్నారు. హాలీవుడ్ నిర్మాతల వరకూ చేరింది ఈ మాట. దీంతో ఇప్పటికి హృతిక్‌కు రెండు, మూడు హాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. కాకపోతే అవన్నీ సెకండ్ లీడ్ అట. హాలీవుడ్లో అయితే ఫుల్ లెంగ్త్ హీరోగానే చేయాలనుకుంటున్న హృతిక్, ఈ ఆఫర్లు ప్రస్తుతానికి రిజెక్ట్ చేశాడట. మరి ఆ ఫుల్ లెంగ్త్ రోల్ ఎప్పుడొస్తుందో చూడాలి! -
తెలుగులో అఖిల్? హిందీలో అర్జున్ కపూర్?
‘అఖిల్’ సినిమాతో లవర్‌బోయ్‌గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తన రెండో సినిమాలో గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది? కచ్చితంగా అది ఫ్యాన్స్‌కు పండగే. ప్రస్తుతం ఇదే ఫిలిమ్నగర్లో హాట్‌టాపిక్‌గా న డుస్తోంది. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘ఓకే బంగారం’తో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా న టించిన ఓ చిత్రం మలయాళ నాట సంచలనం రేపుతోంది. అదే ‘కమ్మటి పాడమ్’. ఇప్పటివరకూ తాను చేసిన లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలకు భిన్నంగా దుల్కర్ సల్మాన్ పూర్తి రఫ్ అండ్ టఫ్ లుక్‌లో నటించిన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. రాజీవ్ రవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. తెలుగు రీమేక్‌లో అఖిల్, హిందీ రీమేక్ కోసం అర్జున్ కపూర్ల పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం.