అఖిల్ వంద గంటలు కష్టపడ్డాడు..!

Akhil Akkineni spent 100 hours for that song - Sakshi

హలో సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న అక్కినేని యంగ్ హీరో అఖిల్, ఆ సక్సెస్‌ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాతో హీరోగానే కాదు గాయకుడిగానూ ప్రూవ్ చేసుకున్నాడు అఖిల్. ఈ సినిమాలో ‘ఏవేవో కలలు కన్నా’ అంటూ సాగే రొమాంటిక్ మెలోడిని ఆలపించాడు అఖిల్. ఈ పాటను పలు వేదికల మీద కూడా పర్ఫామ్ చేసిన అఖిల్ మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఇటీవల ఆ పాటకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు అఖిల్. తనను గాయకుడిగా మార్చిన క్రెడిట్ సంగీత దర్శకుడు అనూప్ రెబెన్స్ దే అన్న అఖిల్, తామిద్దరం ఆ పాట కోసం వంద గంటలకు పైగా శ్రమించినట్టు వెల్లడించాడు. అనూప్ తనకు రెగ్యులర్ సింగర్‌లా పాట పాడేందుకు కావాల్సిన మెలకువలు నేర్చించాడని తెలిపాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో సినిమాతో కళ్యాణి ప్రియదర‍్శన్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top