అఖిల్‌కు జోడిగా ప్రియాంక!

Akhil Akkineni To Romance Taaxiwala Fame Priyanka Jawalkar - Sakshi

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్‌ హీరోగా తెరకెక్కిన మిస్టర్ మజ్ను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కనున్న సినిమాలో అఖిల్ హీరోగా నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.

ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా టాక్సీవాలా బ్యూటీ ప్రియాంక జవాల్కర్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాలో నటిస్తోంది. త్వరలో లాంచనంగా ప్రారంభం కానున్న ఈ సినిమా ఏప్రిల్‌ నుంచి పట్టాలెక్కనుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top