'హలో' తాజా అప్ డేట్ | Akhil Akkineni Hello shooting Update | Sakshi
Sakshi News home page

'హలో' తాజా అప్ డేట్

Oct 21 2017 11:36 AM | Updated on Jul 15 2019 9:21 PM

Akhil Akkineni Hello shooting Update - Sakshi

తొలి సినిమాతో తీవ్రంగా నిరాశపరిచిన అక్కినేని వారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నాగార్జున దగ్గరుండి సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను చక్కబెడుతున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కు నాగచైతన్య, సమంత పెళ్లి పనులతో బ్రేక్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిపోవటంతో హాలో టీం తిరిగి షూటింగ్ మొదలు పెట్టేసింది.

ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ ద్వారా కన్ఫామ్ చేసిన హీరో అఖిల్, హలో ఆఖరి షెడ్యూల్ మొదలైంది. త్వరలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించనున్నాం డిసెంబర్ 22న సినిమా రిలీజ్ అవుతుందంటూ తెలిపారు. అఖిల్ సరసన దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మనం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement