‘రొమాంటిక్‌’గా ఆకాష్‌ పూరి!

Akash Puri New Project Is Romantic - Sakshi

ఆంధ్రాపోరీ, మెహబూబా అంటూ తన తనయుడిని హీరోగా లాంచ్‌ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. అయితే ఈ సారి పూరి జగన్నాథ్‌ కథను అందించి తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. మరోసారి తన తనయుడిని హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఈ మూవీకి ‘రొమాంటిక్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు పూరి జగన్నాథ్‌ అందించగా.. తన శిష్యుడు అనిల్‌ పాడురిని దర్శకుడిగా పరిచయం చేయబోతోన్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. మరి ఈ సినిమా అయినా ఆకాష్‌కు కలిసి వస్తుందో లేదో చూడాలి. పూరి కనెక్ట్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం పూరి రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో బిజీగా ఉన్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top