లాయర్‌గా! | Ajith to play Amitabh Bachchan's role in Pink Tamil remake | Sakshi
Sakshi News home page

లాయర్‌గా!

Aug 18 2018 12:54 AM | Updated on Aug 18 2018 12:54 AM

Ajith to play Amitabh Bachchan's role in Pink Tamil remake - Sakshi

అజిత్‌

ప్రస్తుతం ‘విశ్వాసం’ సినిమాలో హీరోగా నటిస్తున్న అజిత్‌ షెడ్యూల్స్‌ గ్యాప్‌లో కాస్త టైమ్‌ దొరికితే కోర్టుకు వెళ్లాలనుకుంటున్నారట. ఎందుకంటే నెక్ట్స్‌ సినిమాలో ఆయన లాయర్‌గా కనిపించనున్నారని టాక్‌. అజిత్‌ హీరోగా ‘చతురంగ వేటై్ట, ధీరమ్‌ అధికారమ్‌ ఒండ్రు’ చిత్రాల ఫేమ్‌ హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. ఇది హిందీ హిట్‌ ‘పింక్‌’కి రీమేక్‌ అని టాక్‌. అనిరుద్ధరాయ్‌ భట్టాచార్య దర్శకత్వంలో రూపొందిన ‘పింక్‌’లో అమితాబ్‌బచ్చన్, తాప్సీ ముఖ్య తారలుగా నటించిన విషయం తెలిసిందే. అమితాబ్‌ పాత్రలోనే అజిత్‌ నటిస్తారట. ఈ సినిమాను శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ నిర్మిస్తారట.

Advertisement
 
Advertisement
Advertisement