అంధుడి పాత్రలో అక్షయ్ కాదు.. అజయ్ | Ajay Devgan in oppam hindi remake | Sakshi
Sakshi News home page

అంధుడి పాత్రలో అక్షయ్ కాదు.. అజయ్

Dec 24 2016 1:16 PM | Updated on Sep 4 2017 11:31 PM

అంధుడి పాత్రలో అక్షయ్ కాదు.. అజయ్

అంధుడి పాత్రలో అక్షయ్ కాదు.. అజయ్

ఇటీవల కాలంలో సౌత్లో సూపర్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేయటం కామన్ అయిపోయింది. మాస్ యాక్షన్ సినిమాలతో పాటు ఇండస్ట్రింగ్ లైన్స్తో తెరకెక్కిన

ఇటీవల కాలంలో సౌత్లో సూపర్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేయటం కామన్ అయిపోయింది. మాస్ యాక్షన్ సినిమాలతో పాటు ఇండస్ట్రింగ్ లైన్స్తో తెరకెక్కిన సౌత్ సినిమాలు బాలీవుడ్ సినీ జనాలను కూడా అలరిస్తున్నాయి. అందుకే స్టార్ హీరోలు కూడా సౌత్ రీమేక్లలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

అదే బాటలో మలయాళంలో సూపర్ హిట్ అయిన ఒప్పం సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మలయాళంలో దర్శకత్వంలో వహించిన ప్రియదర్శన్ డైరెక్షన్లో బాలీవుడ్ లోనూ రీమేక్ చేయనున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా అక్షయ్ స్థానంలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఒప్పం బాలీవుడ్ రీమేక్పై అధికారిక ప్రకటన రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement