కొత్త కోణం | aishwarya rai negative role in ponniyin selvan | Sakshi
Sakshi News home page

కొత్త కోణం

May 17 2019 12:09 AM | Updated on May 17 2019 12:09 AM

aishwarya rai negative role in ponniyin selvan - Sakshi

ఐశ్వర్యా రాయ్‌

ఇన్ని సంవత్సరాలుగా ఐశ్వర్యా రాయ్‌ను రకరకాల పాత్రల్లో చూశాం. అందం, అభినయం బ్యాలెన్స్‌ చేస్తూ  గుర్తుండిపోయే రోల్స్‌ చేశారామె. అయినా నటిగా ఆమె దాహం తీరలేదు. లేటెస్ట్‌గా ఐష్‌ తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసుకురానున్నారని తెలిసింది. ఆమె నెగటివ్‌ రోల్‌లో కనిపించనున్నారట. తమిళ ఫేమస్‌ నవల పొన్నియిన్‌ సెల్వన్‌ ఆధారంగా మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. విక్రమ్, శింబు, జయం రవి, కార్తీ, నయనతార, అమలా పాల్‌ ముఖ్య పాత్రల్లో నటించనున్నారట. ఇందులో ఐశ్వర్యా రాయ్‌ పాత్రకు నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని తెలిసింది. అధికార దాహం కలిగిన రాణి పాత్రలో ఐష్‌ నటించనున్నారట. చోళుల సామ్రాజ్యం చుట్టూ ఈ కథ సాగనుంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Advertisement
 
Advertisement
Advertisement