రజనీకాంత్ రిటైర్మెంట్‌పై ఐశ‍్వర్య కామెంట్‌ | Aishwarya Dhanush Suggestion To Rajinikanth | Sakshi
Sakshi News home page

Jun 12 2018 3:51 PM | Updated on Jun 12 2018 6:19 PM

Aishwarya Dhanush Suggestion To Rajinikanth - Sakshi

సూపర్‌ స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తెర మీద కనిపిస్తే చాలని భావించే వీరభిమానలకు కొదువే లేదు. కోలీవుడ్‌ సినీ జనాలకు రజనీ దేవుడితో సమానం. ఇతంటి క్రేజ్‌ ఉన్న రజనీకాంత్‌ను ఆయన కూతురు ఓ అనూహ్యమైన  కోరిక కోరారు. రజనీ కుమార్తె ఐశ్వర్య ధనుష్‌ తండ్రిని సినిమాలు మానేయాలని కోరారట. ఈ విషయాన్ని ఐశ్వర్య స్వయంగా వెల్లడించారు.

కాలా రిలీజ్‌ తరువాత జాతీయ మీడియాతో మాట్లాడిన ఐశ‍్వర్య, తండ్రి కుటుంబానికి కొంత సమయం కేటాయించాలని కోరారు.  పూర్తిగా సినిమాలకు రిటైర్మెంట్‌ ప్రకటించకపోయినా.. కాస్త పని తగ్గించుకొని కుటుంబంతో ఆనందంగా గడపాలని తాము కోరుకుంటున్నట్టుగా వెల్లడించారు. హీరోగా ఎదుగుతున్న దశలో రజనీ ఏడాదికి ఏడెనిమది సినిమాల్లో నటించేవారన్న ఐశ్వర్య, సినిమాల కారణంగా ఆయన ఫ్యామిలీతో గడపాల్సిన సమయాన్ని కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు.

ఆయన మూలంగా ప్రజలు ఎంత ఆనందం పొందుతున్నారో నాకు తెలుసు అందుకే రిటైర్మెంట్‌ ప్రకటించకమని కోరలేకపోతున్నామన్నారు ఐశ్వర్య. ఇటీవల కాలాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, ప్రస్తుతం యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. రజనీ హీరోగా తెరకెక్కిన 2.ఓ నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement