ఫిక్షనల్‌ కాదు ఒరిజినల్‌ బ్లాక్‌బస్టర్‌

Agent Sai Srinivasa Athreya has Grossed More Than 10Crs - Sakshi

నవీన్‌ పొలిశెట్టిని హీరోగా పరిచయం చేస్తూ స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. చాలా కాలం తరువాత డిటెక్టివ్‌ తరహా కథతో రూపొందించిన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా నవీన్‌ నటన, స్వరూప్‌ టేకింగ్‌ను సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
(మూవీ రివ్యూ : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ)

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లో పది కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఈసందర్భంగా చిత్రయూనిట్ ఫిక్షనల్‌ కాదు ఒరిజినల్‌ బ్లాక్‌ బస్టర్‌ అంటూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మళ్లీరావా సినిమాతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన రాహుల్‌యాదవ్‌ నక్కా ఈ సినిమాతో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top