బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

Agent Sai Srinivasa Athreya Fame Naveen Polishetty Signed His Next - Sakshi

చాలా కాలం తరువాత తెలుగు తెర మీద వచ్చిన డిటెక్టివ్‌ తరహా సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమాతో క్యారెక్టర్ నటుడు నవీన్‌ పొలిశెట్టి హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే అశ్వనీదత్‌ కుమార్తె స్వప్న నిర్మించనున్న సినిమాలో నవీన్‌ నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాతో పాటు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నిర్మాతలు కూడా నవీన్‌ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు ప్రాజెక్ట్స్‌ చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది, ఒక్క సినిమాతోనే అం‍దరి దృష్టిని ఆకర్షించిన నవీన్ పొలిశెట్టి ఆ సక్సెస్‌ ట్రాక్‌ను ఏ మేరకు కంటిన్యూ చేస్తాడో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top