‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ షూటింగ్ పూర్తి

Agent Sai Srinivasa Athreya completes shooting - Sakshi

నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ జంటగా నటిస్తున్న డిటెక్టివ్‌ మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. దర్శకుడు స్వరూప్ RSJ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వినోదాత్మకంగా ఉన్న నవీన్ పొలిశెట్టి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు తెరపై ఈ తరహా కథలు వచ్చి చాలా కాలం కావటంతో ఈ కామెడీ ఏజెంట్ మెప్పిస్తాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు మార్క్ K రాబిన్ సంగీతం అందిస్తుండగా.. సన్నీ కురపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మళ్లీ రావా లాంటి చిత్రాన్ని నిర్మించిన రాహుల్ యాదవ్ నక్క స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top