ముసుగు వెయ్యొద్దు...

After Shruti Hasan, now Evelyn Sharma stalked ! - Sakshi

... మనసు మీద’ అని ‘ఖడ్గం’లో పాట గుర్తుండే ఉంటుంది. ఇక్కడున్న రెండు ఫొటోలు చూస్తుంటే.. ముసుగు వెయ్యొద్దు ముఖము మీద అనాలనిపిస్తోంది. ఈ మాస్క్‌ వెనకాల ఉన్న ముఖారవిందాలు ఎవరివో తెలుసుకోవాలని ఉంది కదూ. అయితే చిన్న క్లూ. ఒక ముఖం లోకనాయకుడి కుమార్తెగా  ఇండస్ట్రీకి వచ్చి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ది. మరో ముఖం ఎవరిదో తెలుసుకోవాలంటే బాలీవుడ్‌కి వెళ్లాల్సిందే.

జర్మనీలో పుట్టి, పెరిగిన ఈ భామ ‘ఫ్రమ్‌ సిడ్నీ విత్‌ లవ్‌’ అనే హిందీ సినిమా ద్వారా భారతీయ తెరకు పరిచయమయ్యారు. ఇప్పుడు తెలుగులో మిర్చిలాంటి కుర్రాడి సరసన నటిస్తున్నారు. ఈ క్లూస్‌తో ఈ ఇద్దరు ముఖాలు ఎవరివో కనిపెట్టేసి ఉంటారు. అయినా మేమే చెప్పేస్తున్నాం. ఒకరు లోకనాయకుడు కమల్‌హాసన్‌ కుమార్తె, స్టార్‌ హీరోయిన్‌ శ్రుతీహాసన్, మరొకరు ఎవెలిన్‌ శర్మ. ఇంతకీ వీళ్లిద్దరూ ఎందుకిలా ఫేస్‌ని కవర్‌ చేశారంటే.. ముఖారవిందం తళుకులీనడానికి ఫేస్‌ మాస్క్‌ వేసుకున్నారేమో!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top