పెద్ద వయసు రజనీ... చిన్న వయసు కూతురు! | adult Rajani ... young daughter! | Sakshi
Sakshi News home page

పెద్ద వయసు రజనీ... చిన్న వయసు కూతురు!

Aug 11 2015 11:52 PM | Updated on Sep 3 2017 7:14 AM

పెద్ద వయసు రజనీ... చిన్న వయసు కూతురు!

పెద్ద వయసు రజనీ... చిన్న వయసు కూతురు!

సరిగ్గా మరో పదిరోజుల్లో పూజా కార్యక్రమాలు జరుపుకోనున్న వేళ సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా సినిమా గురించి రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది.

సరిగ్గా మరో పదిరోజుల్లో పూజా కార్యక్రమాలు జరుపుకోనున్న వేళ సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా సినిమా గురించి రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. తాజా కబురేమిటంటే, ‘అట్ట కత్తి’, ‘మద్రాస్’ లాంటి చిత్రాలు రూపొందించిన రంజిత్ దర్శకత్వంలో తయారయ్యే ఈ సినిమాలో రజనీకాంత్‌కు ఒక కూతురు పాత్ర కూడా ఉంటుందట! కూతురు పాత్ర అంటే, ఎవరో బాల నటి నటించే పాత్ర కాదు. ఏకంగా హీరోయిన్ తరహా నటి చేయాల్సిన పాత్రే! ఈ పాత్ర కోసం ప్రముఖ తమిళ నటి ధన్సికను చిత్ర యూనిట్ సంప్రతిస్తోందట! ఈ చిత్రంలో వయసు మీద పడుతున్న గ్యాంగ్‌స్టర్ పాత్రను రజనీకాంత్ పోషిస్తున్నట్లు సమాచారం. ‘లెజెండ్’, ‘లయన్’ చిత్రాల్లో బాలకృష్ణ పక్కన కనిపించిన బాలీవుడ్ నటి రాధికా ఆప్తే ఆయన భార్య పాత్ర ధరిస్తున్నారు.
 
 కాగా, రజనీ కుమార్తె పాత్ర కోసం ఇప్పుడు అన్వేషణ సాగుతోంది. తమిళ నటి అక్షర (‘ఆరంబమ్’ ఫేమ్)తో సహా కొంతమంది కొత్తవాళ్ళను కూడా ఆ పాత్ర కోసం అడిగారట. చివరకు తమిళ చిత్రాలు ‘అరవాన్’, ‘పరదేశి’ ఫేమ్ అయిన యువ నటి ధన్సికతో చర్చలు జరుగుతున్నాయి. దర్శకుడు రంజిత్ సైతం ఈ చర్చల విషయం నిజమేనని ధ్రువీకరించారు. గత ఏడాది చివరలో వచ్చిన రజనీకాంత్ సినిమా ‘లింగ’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
 
 దాంతో, ఇప్పుడీ కొత్త చిత్రాన్ని మరింత జాగ్రత్తగా రూపొందించాలని రజనీ బృందం సిద్ధమవుతోంది. రజనీకాంత్‌కు కలిసొచ్చిన ‘కాళీ’ అనే టైటిల్‌నే ఈ సినిమాకూ పెడతారని సమాచారం. ఈ నెల 21న జరగనున్న పూజా కార్యక్రమాల సమయంలో మరిన్ని వివరాలు బయటకు రావచ్చు. సెప్టెంబర్ నుంచి మలేసియాలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని కోడంబాకమ్ కబురు.
 

Advertisement
 
Advertisement
Advertisement