భావోద్వేగాల క్షీరసాగరమథనం

Adivi Sesh Launches Ksheera Sagara Madhanam First Look and Poster - Sakshi

‘ఝలక్, గ్రీన్‌ సిగ్నల్, ప్రేమికుడు, సోడా గోలిసోడా’  చిత్రాల ఫేమ్‌ మానస్‌ నాగులపల్లి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ కుమార్‌ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘క్షీరసాగర మథనం’. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనిల్‌ పంగులూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయవుతున్నారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్‌తో కలిసి ఆర్ట్‌ అండ్‌ హార్ట్‌ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది.

అక్షిత సొనవనే హీరోయిన్‌గా, ప్రదీప్‌ రుద్ర ప్రతినాయకుడుగా నటించారు. హీరో సందీప్‌ కిషన్‌ ఇటీవల టైటిల్‌ని విడుదల చేయగా, తాజాగా హీరో అడివి శేష్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘పలు రకాల భావోద్వేగాలతో మనసుల్ని రంజింపచేసే చిత్రమిది. మంచి సినిమా చూశామనే సంతృప్తిని ప్రేక్షకులకు మిగిల్చేలా ఉంటుందనే నమ్మకం మాకుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అజయ్‌ అరసడ, కెమెరా: సంతోష్‌ షనమోని, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top