నానికి జోడిగా అదితి!

Aditi Rao Hydari Pairs Up With Nani - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని తరువాత విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో గ్యాంగ్‌ లీడర్‌ సినిమాను ఎనౌన్స్‌ చేశాడు. ఈ రెండు సినిమాల రిలీజ్‌కు ముందే మరో సినిమాను కూడా ఫైనల్‌ చేశారు నాని. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మెహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు నాని.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో నానికి జోడిగా అదితి రావ్‌ హైదరిని హీరోయిన్‌గా తీసుకున్నారట. గత చిత్రం సమ్మెహనంలో హీరోయిన్‌గా నటించిన అదితిని ఈ సినిమాలో తీసుకునే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు ఇంద్రగంటి. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరో సుధీర్‌ బాబు కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter |
తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top