అలా పెళ్లి చేసుకోవాలని ఉంది | Aditi Rao Hydari opened up on her idea of wedding | Sakshi
Sakshi News home page

అలా పెళ్లి చేసుకోవాలని ఉంది

Oct 13 2019 5:29 AM | Updated on Oct 13 2019 5:29 AM

Aditi Rao Hydari opened up on her idea of wedding - Sakshi

పెళ్లి విషయాల్లో అమ్మాయిలకు ఎన్నో కలలుంటాయి. ‘రెక్కల గుర్రం మీద రాకుమారుడు రావాలి, ఊరంతా చెప్పుకునేలా పెళ్లి జరగాలి’ అని ఎవరి కలలు వాళ్లవి. మరి మీ డ్రీమ్‌ వెడ్డింగ్‌ ఏంటి? అనే ప్రశ్నను అదితీరావ్‌ హైదరీని అడిగితే ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘‘నా పెళ్లిలో నేను అచ్చు రాజారవివర్మ బొమ్మను తలపించేలా ఉండాలి. మా అమ్మగారి వివాహం జరిగినప్పుడు ఆమె మేకప్‌ లేకుండా సింపుల్‌గా ఉన్నారు. నేనూ అలానే ఉంటాను.  నా పెళ్లి బీచ్‌ ఒడ్డున ఉండే రాజుల నాటి భారీ కోటలో జరగాలి. పెళ్లికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాక చెప్పులు తీసేసి బీచ్‌లో పరిగెడతాను. రాత్రంతా డ్యాన్స్‌ చేస్తూనే ఉంటాను. నేను చెప్పేవన్నీ ఒకదానికి ఒకటి పొంతన లేకపోవచ్చు. కానీ నేనంతే. నా ఆలోచనలన్నీ ఒకేలా ఉండవు’’ అన్నారు. ఇదిలా ఉంటే అదితీరావ్‌కి ఆల్రెడీ పెళ్లయింది. కానీ భర్త నుంచి విడిపోయారామె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement