శ్రీదివ్యకు షాక్ | Actress Sri divya to shock the lead roles | Sakshi
Sakshi News home page

శ్రీదివ్యకు షాక్

Jun 28 2016 3:07 AM | Updated on Apr 3 2019 9:16 PM

శ్రీదివ్యకు షాక్ - Sakshi

శ్రీదివ్యకు షాక్

అనుకున్నవి జరగకపోవడం, ఊహించనివి జరగడమే జీవితం. నటి శ్రీదివ్య ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారని...

అనుకున్నవి జరగకపోవడం, ఊహించనివి జరగడమే జీవితం. నటి శ్రీదివ్య ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్లలో టాలీవుడ్ చిన్నది శ్రీదివ్య ఒకరని చెప్పకతప్పదు. వరుత్తపడాదవాలిభన్ చిత్రం ఈ బ్యూటీ జీవితాన్ని మార్చేసింది. అంతే  కాదు తదుపరి నటించిన చిత్రాలు విజయం సాధించడంతో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్నారు. ఇటీవల విశాల్‌కు జంటగా నటించిన మరుదు చిత్రం వరకూ శ్రీదివ్య కెరీర్ విజయవంతంగా సాగింది.

ప్రస్తుతం ఈ అమ్మడు కార్తీతో కాష్మోరా, జీవాకు జంటగా సంగిలి బుంగిలి చిత్రాలలో నటిస్తున్నారు. అయితే చిక్కంతా వచ్చింది ఎక్కడంటే కాష్మోరా చిత్రంలో నయనతార నాయకిగా నటిస్తున్నారు. దీంతో శ్రీదివ్య రెండో నాయకి స్థాయికి పడిపోయారు. అయినా ఫర్వాలేదనుకున్న సమయంలో ఈ చిత్రంలో మరో నాయకిగా నటి మనీషా యాదవ్ వచ్చి చేరింది. దీంతో కాష్మోరాలో ముగ్గురు నాయికలు అయ్యారు. అయినా ఫర్వాలేదని సర్దుకు పోయి నటిస్తున్న శ్రీదివ్యకు తాజాగా రెండవ నాయకి పాత్రలు వరుస కడుతున్నాయట.

దీంతో షాక్‌కు గురైన శ్రీదివ్య తాను కాష్మోరా చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తున్నా ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్న కార్తీకి ఒక పాత్రలో తాను నాయకినని పేర్కొన్నారు. ఈ చిత్రం విడుదలైన తరువాత ఈ విషయం మీకే తెలుస్తుందనీ అంటూ తాజాగా వస్తున్న సెకెండ్ హీరోయిన్ పాత్రలను నిరాకరిస్తున్నారట. ఏదేమైనా ఇటాంటి పరిస్థితులను శ్రీదివ్య ఎదుర్కోవడం ఆమె వర్గాలను ఆలోచనలో పడేసిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.

Advertisement
 
Advertisement
Advertisement