హ్యాకింగ్‌ బాధితులు : నిన్న త్రిష.. నేడు రకుల్‌ | Actress Rakul Preet Instagram account hacked | Sakshi
Sakshi News home page

హ్యాకింగ్‌ బాధితులు : నిన్న త్రిష.. నేడు రకుల్‌

Oct 24 2018 7:25 PM | Updated on Oct 24 2018 7:27 PM

Actress Rakul Preet Instagram account hacked - Sakshi

తమ సోషల్‌ మీడియా అకౌంట్‌లు హ్యాక్‌ అయ్యాయంటూ చెబుతున్న హీరోయిన్‌ల సంఖ్య పెరుగుతోంది. రెండు, మూడు రోజుల క్రితమే త్రిష తన ట్విట్టర్‌ ఖాతాని ఎవరో ఆగంతకులు హ్యాక్‌ చేశారని తెలిపింది. ఇప్పుడు ఈ కోవలోకి హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చేరారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని రకుల్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా తన అకౌంట్‌ నుంచి వచ్చే సందేశాలకు స్పందించవద్దంటూ రకుల్‌ అభిమానులను కోరారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రకుల్‌ కార్తీ దేవ్‌ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement