నటి పూర్ణ పెళ్లికి అడ్డంకులు | Actress Poorna Says about her Marriag | Sakshi
Sakshi News home page

నటి పూర్ణ పెళ్లికి అడ్డంకులు

Oct 16 2018 11:57 AM | Updated on Apr 3 2019 9:13 PM

Actress Poorna Says about her Marriag - Sakshi

పూర్ణ ఇంట బాజా భజంత్రీలు మ్రోగేదెప్పుడో చూద్దాం.

 తన పెళ్లికి పలు అంశాలు అడ్డంకులుగా మారుతున్నాయని వాపోతోంది నటి పూర్ణ. మాతృకం మలయాళం అయినా కోలీవుడ్, టాలీవుడ్‌ అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించేస్తున్న ఈ బహు భాషానటి మొదట్లో మోడలింగ్, బుల్లితెర యాంకరింగ్‌ చేసి 2004లో నటనకు శ్రీకారం చుట్టింది. కోలీవుడ్‌కు 2008లో మునిరయాండి విలంగియల్‌ మూండ్రామాండు చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. తాజాగా నటనకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అవుతోంది. పూర్ణ మంచి డాన్సర్‌ అన్న విషయం తెలిసిందే. ఖాళీగా ఉంటే స్టేజీ పోగ్రామ్స్‌ ఇవ్వడానికి ఇష్ట పడుతుంది. ఆ అమ్మడికి ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న పెళ్లి ఎప్పుడన్నదే.కారణం ఈ అమ్మడికన్నా వెనుక వచ్చిన చాలా మంది నటీమణులు పెళ్లిళ్లు చేసుకుని పిల్లాపాపలతో సంసారం చేసుకుంటున్నారు. ఈ విషయం గురించి నటి పూర్ణ ఇటీవల ఒక టీవీ.ఛానల్‌కు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ తన పెళ్లి గురించి తన తల్లి మాట్లాడని రోజు లేదని అంది. 

తనకూ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉందనీ, అందుకు పలు ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పింది. అందులో ముఖ్యంగా జాతి సమస్య అని పేర్కొంది. అది మీరి పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అంటున్న వారూ వివాహానంతరం నేను నటనను, నాట్యాన్ని మానుకోవాలని షరతులు విధిస్తున్నారని చెప్పింది. ఇక ప్రేమ వివాహం చేసుకుందామన్నా, అప్పుడు కూడా ఇలాంటి సమస్యలు రావని గ్యారెంటీ ఉంటుందా? అని ప్రశ్నించింది. అందుకే తన వివాహం వాయిదా పడుతోంది అని చెప్పింది. కాగా జాతి జాడ్యం లేని, ఎలాంటి షరతులు విధించని వ్యక్తి తారస పడితే వివాహం చేసుకోవడానికి తాను రెడీ అని అంటోంది. ఇస్లామ్‌ మతానికి చెందిన పూర్ణ అసలు పేరు షమ్నాఖాసీం అన్న విషయం చాలా మందికి తెలిసుంటుంది. మరి ఈ అమ్మడిని అర్థం చేసుకుని ఆమె మనసును గెలుసుకునే వ్యక్తి ఎక్కడున్నాడో? ఆ కల్యాణ ఘడియలు ఎప్పుడు వస్తాయో? పూర్ణ ఇంట బాజా భజంత్రీలు మ్రోగేదెప్పుడో చూద్దాం. ఈ బ్యూటీ ప్రస్తుతం మలయాళంతో పాటు తెలుగులో సువర్ణసుందరి, తమిళంలో అడంగ మను, ఇవనుక్కు ఎంగయో మచ్చ ఇరుక్కు చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement