ప్రేమ పుట్టింది కానీ..

Actress Oviya Love Story Reveals - Sakshi

సినిమా: ప్రేమ పుట్టింది కానీ.. అంటోంది నటి ఓవియ. సమీప కాలంలో సంచలన నటిగా మారిందీ బ్యూటీ. 90 ఎంఎల్‌ అనే వివాదాస్పద కథా చిత్రంలో నటించి విమర్శలను ఎదుర్కొన్న ఓవియ ఇప్పటికి 25 చిత్రాల్లో నటంచింది. వాటిలో మలయాళం, కన్నడం చిత్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఈమె తన గురించి తెలుపుతూ సొంత ఊరు కేరళలోని తిరుచూర్‌. బీఏ చదివి 2007లో నటిగా రంగప్రవేశం చేశాను. కంగారు అనే మలయాళ చిత్రంతో కథానాయకిగా నటించాను.

అలా కొన్ని చిత్రాల్లో నటించిన తరువాత 2010లో కలవాణి చిత్రంతో కోలీవుడ్‌కు ఎంటర్‌ అయ్యాను. కథానాయికల మధ్య పోటీ ఉన్నమాట నిజమే. అయితే అన్ని రంగాల్లోనూ పోటీ ఉంటుంది. నా అందం గురించి చాలా మంది అభినందించారు. అయితే నా ముఖం అందం కంటే మనసు ఇంకా అందం అని ధైర్యంగా చెప్పగలను. కళాశాలలో చదువుతున్నప్పుడే ప్రేమ పుట్టింది. అయితే దానిపై మనసు పెట్టలేదు. అప్పుడు నావయసు 18 ఏళ్లు.  సినిమాల్లోకి వచ్చిన తరువాత నటనపైనే శ్రద్ధ పెడుతున్నాను. ప్రేమించడానికి సమయం లేదు.ఎవరికీ ఎందుకూ భయపడను. చిన్న వయసు నుంచే నాకు ధైర్యం ఎక్కువ. సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా అది తగ్గలేదు అని నటి ఓవియ చెప్పుకొచ్చింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top