'ఆ ఫేస్బుక్ అకౌంట్ నాది కాదు' | Actress Lara Dutta warns fans against fake Facebook account | Sakshi
Sakshi News home page

'ఆ ఫేస్బుక్ అకౌంట్ నాది కాదు'

Oct 4 2015 4:48 PM | Updated on Apr 3 2019 6:23 PM

'ఆ ఫేస్బుక్ అకౌంట్ నాది కాదు' - Sakshi

'ఆ ఫేస్బుక్ అకౌంట్ నాది కాదు'

తన పేరు మీద ఫేస్బుక్లో నకిలీ ఖాతా ఎవరో తెరిచారని బాలీవుడ్ హీరోయిన్ లారాదత్తా చెప్పింది.

ముంబయి: తన పేరు మీద ఫేస్బుక్లో నకిలీ ఖాతా ఎవరో తెరిచారని బాలీవుడ్ హీరోయిన్ లారాదత్తా చెప్పింది. ఈ అకౌంట్ నుంచి వచ్చే సందేశాలు, పోస్టింగ్స్, తదితర విషయాల పట్ట చాలా జాగ్రత్తగా ఉండాలని తన అభిమానులను హెచ్చిరిస్తూ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. తనకు కేవలం ట్విట్టర్ ఖాతా మాత్రమే ఉన్నట్లు తెలిపింది. తన పేరు మీద ఉన్న ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఏమైనా ఫ్రెండ్ రిక్వెస్ట్స్ వస్తే ఎవ్వరూ యాక్సెప్ట్ చేయవద్దంటూ ఈ మాజీ విశ్వసుందరి అభిమానులను కోరుతోంది.

తన లేటెస్ట్ మూవీ 'సింగ్  ఈజ్ బ్లింగ్' లో నటనకు గానూ తనకు పాసిటివ్ రెస్పాన్స్ రావడంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. అక్షయ్ కుమార్, అమి జాక్సన్ కూడా నటించిన ఈ మూవీ ఇటీవలే విడుదలైన విషయం విదితమే. రెండేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్పై కనిపించిన లారాదత్తా, ఫేస్బుక్ అకౌంట్ తనది కాదని అభిమానులు, మిత్రులు ఈ విషయాన్ని గుర్తించాలని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ ఈ వివరాలు పోస్ట్ చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement