ఇంకా ఏదో... కావాలనేవాళ్లు! | Actress Kriti Sanon hot Comments on film industry | Sakshi
Sakshi News home page

ఇంకా ఏదో... కావాలనేవాళ్లు!

May 14 2015 11:40 PM | Updated on Sep 3 2017 2:02 AM

ఇంకా ఏదో... కావాలనేవాళ్లు!

ఇంకా ఏదో... కావాలనేవాళ్లు!

నువ్వు అందంగా ఉన్నావు కానీ, ఇంకా అందంగా ఉంటే బాగుంటుంది’’ అని ఎవరైనా అంటే, అది పొగడ్తో,

 ‘‘నువ్వు అందంగా ఉన్నావు కానీ, ఇంకా అందంగా ఉంటే బాగుంటుంది’’ అని ఎవరైనా అంటే, అది పొగడ్తో, తెగడ్తో అర్థం కాదు. ఒకప్పుడు కృతీ సనన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. దాని గురించి ఈ పొడుగు కాళ్ల సుందరి చెబుతూ - ‘‘హిందీలో తొలి చిత్రం ‘హీరో పంతి’, తెలుగులో తొలి చిత్రం ‘1... నేనొక్కడినే’కి ముందు నాకు కొన్ని అవకాశాలొచ్చాయి. ఆ చిత్రాలకు సంబంధించిన ఆడిషన్స్‌లో కూడా పాల్గొన్నాను. అప్పుడు ‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్. కానీ ఇంకా ఏదో కావాలి’ అనేవాళ్లు. ఆ అవకాశం ఎవరైనా స్టార్ హీరోయిన్‌కి వెళ్లిపోయేది. దాంతో నిరుత్సాహపడేదాన్ని. అప్పుడు నేను కొత్తమ్మాయిని కాబట్టి, వంకలు చెప్పేవాళ్లు.
 
  నా అందంలో ఏదైనా లోపం కనిపిస్తే, మొహం మీదే చెప్పేసేవాళ్లు. ఇప్పుడు కొంచెం గుర్తింపు వచ్చింది కాబట్టి, లోపాలు కనిపించినా ‘నువ్వు సూపర్... గొప్ప అందగత్తెవి’ అనేస్తున్నారు. ఇంకా నవ్వొచ్చే విషయం ఏంటంటే... నాకు పాపులారిటీ వచ్చాక, ‘ఒకప్పుడు మాధురీ దీక్షిత్ జుత్తు బాగుండేది కాదు. కానీ, తను పెద్ద స్టార్ అయ్యింది. నీకేంటి నువ్వు కూడా స్టార్‌వి అయిపోతావ్’ అన్నాడో వ్యక్తి.  అదే వ్యక్తి మొదట్లో నన్ను విమర్శించాడు. అందుకే అంటున్నా... విమర్శలనూ, పొగడ్తలనూ పట్టించుకోకూడదు. మనల్ని మనం నమ్మితే ఎప్పటికైనా పైకొస్తాం’’ అన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement