హ్యూమాకి భయమా? | Actress Huma Qureshi trains in bike stunts | Sakshi
Sakshi News home page

హ్యూమాకి భయమా?

Mar 20 2020 6:06 AM | Updated on Mar 20 2020 6:06 AM

Actress Huma Qureshi trains in bike stunts - Sakshi

హ్యూమా ఖురేషీ

ముంబై వీధుల్లో బైక్‌పై షికారు చేస్తున్నారు హ్యూమా ఖురేషీ. కానీ ఇది సరదా కోసం చేస్తున్న షికారు కాదు. తన కొత్త సినిమా కోసం హ్యూమా నేర్చుకుంటున్న బైక్‌ పాఠాలు. అజిత్‌ హీరోగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో బోనీ కపూర్‌ నిర్మాతగా తమిళంలో ‘వలిమై’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా నటిస్తున్నారు హ్యూమా ఖురేషీ. రేసింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలోని తన క్యారెక్టర్‌ కోసం హ్యూమా ఖురేషీ బైక్‌ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇందులో హ్యూమా అదిరిపోయే బైక్‌ స్టంట్స్‌ కూడా చేస్తారట. బైక్‌ స్టంట్స్‌ అంటే చిన్న విషయం కాదు. చాలా ధైర్యం ఉండాలి. ‘హ్యూమాకి భమయా’ అంటూ సరదాగా నవ్వుతూ హ్యూమా బైక్‌ స్టంట్స్‌ నేర్చుకుంటున్నారు. ఇందులో అజిత్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ వైజాగ్‌లో జరగాల్సింది. కానీ కరోనా వైరస్‌ ప్రభావంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement