30 రోజులకే కెమెరా ముందుకి... | Actor Srinivas Reddy's one month old daughter debuts in Jamba Lakidi Pamba | Sakshi
Sakshi News home page

30 రోజులకే కెమెరా ముందుకి...

Jan 27 2018 1:06 AM | Updated on Sep 18 2018 8:13 PM

Actor Srinivas Reddy's one month old daughter debuts in Jamba Lakidi Pamba - Sakshi

భార్య స్వాతి, కుమార్తె, కథానాయికతో శ్రీనివాసరెడ్డి

ఓ వైపు హాస్యనటుడిగా నవ్విస్తూనే.. అప్పుడప్పుడు హీరోగానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు శ్రీనివాసరెడ్డి. ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమా తర్వాత ఆయన కథానాయకునిగా తెరకెక్కుతోన్న చిత్రం  ‘జంబలకిడి పంబ’. జె.బి. మురళీకృష్ణ దర్శకత్వంలో రవి, జోజో జోస్,  శ్రీనివాసరెడ్డి. ఎన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి కూతురు నటిస్తోంది. ఈ చిన్నారి వయసెంతో తెలుసా? జస్ట్‌ 30 రోజులు. ఇంకా నామకరణం కూడా చేయలేదు.

కానీ కెమెరా ముందుకు వచ్చేసింది శ్రీనివాసరెడ్డి కుమార్తె. ‘‘నెల వయసు ఉన్న మా పాప ‘జంబలకిడి పంబ’ సినిమాతో కెమెరా ముందుకొచ్చింది. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమా తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుంది’’ అని సంబరపడిపోయారు శ్రీనివాసరెడ్డి. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇందులో సిద్ధి ఇద్నాని కథానాయిక. పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిశోర్, ‘సత్యం’ రాజేష్, ధన్‌రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: గోపీసుందర్, కెమెరా: సతీశ్‌ ముత్యాల, సహ నిర్మాత: బి.సురేశ్‌ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement