ఈ హీరో ఎవరో గుర్తు పట్టండి? | actor siddharth visit Tirumala | Sakshi
Sakshi News home page

ఈ హీరో ఎవరో గుర్తు పట్టండి?

Jun 19 2014 7:28 PM | Updated on Apr 3 2019 8:56 PM

ఈ హీరో ఎవరో గుర్తు పట్టండి? - Sakshi

ఈ హీరో ఎవరో గుర్తు పట్టండి?

ఈ ఫోటోలోని వ్యక్తిని గుర్తు పట్టారా. సినిమా హీరో సిద్ధార్థ్. సినిమాలో పాత్ర కోసం అతడు గుండు కొట్టించుకోలేదు.

తిరుమల: ఈ ఫోటోలోని వ్యక్తిని గుర్తు పట్టారా. ఇతను మరెవరో కాదు సినిమా హీరో సిద్ధార్థ్. సినిమాలో పాత్ర కోసం అతడు గుండు కొట్టించుకోలేదు. భక్తితో గుండు గీయించుకున్నాడు. విషయమేమిటంటే సిద్ధార్థ్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి తొలుత తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. అనంతరం ఉదయం నైవేద్య విరామ సమయం తర్వాత ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు.

ఇటీవల కాలంలో హిట్ సినిమాలు లేకపోవడంతో సిద్ధార్థ వెనుకబడ్డాడు. అతడు నటించిన సినిమాలు ఇటీవల కాలంలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. మరోవైపు అతడిపై రోజుకో పుకారు షికారు చేస్తోంది. తాజాగా అతడికి కొడుకు ఉన్నాడంటూ రూమర్ వచ్చింది. దీన్ని సిద్ధార్థ్ ఖండించాడు. ఇక సమంతతో ప్రేమాయణం సరేసరి. ప్రస్తుతం సిద్ధార్థ్ కు బ్యాడ్ పీరియడ్ నడుస్తున్నట్టు కనబడుతోంది. దీంతో మునుపటి కంటే ఇప్పుడు నటుడిగా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. విజయం కోసం తహ తహలాడుతున్నాడు. శ్రీవారి దర్శనంతోనైనా సిద్ధార్థ్ దశ తిరుగుతుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement