‘బిగ్‌బాస్‌’పై హేమ సంచలన వ్యాఖ్యలు

Actor Hema Sensational Comments On Bigg Boss 3 Telugu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు బుల్లితెరపై ఆసక్తికరంగా సాగుతున్న బిగ్‌బాస్‌ 3 షోపై నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలిమినేట్ అయిన‌పుడు నాగార్జున ముందు అంతా బాగుందని చెప్పిన హేమ‌.. ఇప్పుడు మాత్రం మాట మార్చేశారు. బిగ్‌బాస్‌-3 నుంచి కావాలనే తనను బయటకు పంపారని ఆరోపించారు. ఈ షోలో ఉన్నది ఉన్నట్లుగా చూపించడంలేదన్నారు. లోపల ఒకటి జరిగితే బయట ఒకటి ప్రసారం చేశారని విమర్శించారు. కాగా ఆదివారం జరిగిన మొదటి ఎలిమినేషన్‌ ప్రక్రియలో హేమ బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడిన సంగతి తెలిసిందే.

15 మందిలో మొత్తం ఆరుగురు.. రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు తొలివారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. వీరిలో అందరూ ఊహించనట్లే  షో నుంచి హేమ ఎలిమినేట్‌ అయ్యారు. సెల్ఫీ మూవ్‌మెంట్‌ అనంతరం  హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన హేమ.. తన జర్నీకి సంబంధించిన ప్రోమోను చూస్తూ ఎమోషనల్‌ అయ్యారు. వంటగది వల్లే గొడవలు వచ్చాయని, అది తప్ప తనపై ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు. ఓ మదర్‌ ఫీలింగ్‌తో ఉన్నానని, అయితే ఎక్కువ పెట్టుకోవద్దు.. అది తీయొద్దు ఇది తీయొద్దు అని అనడంతో అది డామినేట్‌ చేయడం, కమాండింగ్‌లా అందరికీ అనిపించిందని.. అందుకే అందరూ తనను బ్యాడ్‌ అని అనుకున్నారని తెలిపారు. వాళ్ల కోసం చేసేది వాళ్లకే అర్థం కానప్పుడు అక్కడ ఉండటం వ్యర్థమనిపించిందని చెప్పారు. హౌస్‌మేట్స్‌ గురించి మాట్లాడుతూ.. అదరూ మంచివాళ్లేనని తెలిపింది. హౌజ్‌మేట్స్‌లో నచ్చనివారు ఎవరైనా ఉన్నారా అని నాగార్జున అడగ్గా.. అలాటిందేమి లేదని, అందరూ మంచి వారేనని, మంచిగా గేమ్‌ ఆడుతున్నారని చెప్పుకొచ్చింది. శ్రీముఖి.. బాబా భాస్కర్‌ మాత్రం ఫైనల్‌ వరకు ఉండొచ్చని తెలిపారు.

ఇలా అందరి గురించి మంచిగా మాట్లాడిన హేమ.. బయటకు వచ్చి మాత్రం మాట మార్చేశారు.  ఈ షోలో ఉన్నది ఉన్నట్లు చూపించలేదని, ప్లాన్‌ వేసి తనను బయటకు పంపారని ఆరోపించారు. అక్కా.. అక్కా.. అంటూనే తనపై లేని పోని మాటలు చెప్పారని వాపోయారు. హౌజ్‌లో గొడవ జరిగిన విధానానికి..షోలో చూపించిన విధానానికి పొంతనే లేదన్నారు. మరో వైపు ఎలిమినేట్‌ అయిన హేమ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆదివారం  వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ కూడా జరిగింది. ట్రాన్స్‌జెండర్‌ తమన్నాసింహాద్రికి వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తూ ఉత్కంఠకు తెరదించాడు కింగ్‌ నాగార్జున.  దీంతో బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆసక్తి నెలకొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top