శిరీష్.. సైన్స్ ఫిక్షన్ | Actor Allu Sirish's next film will be a sci-fi thriller | Sakshi
Sakshi News home page

శిరీష్.. సైన్స్ ఫిక్షన్

Oct 12 2016 11:14 PM | Updated on Sep 4 2017 5:00 PM

శిరీష్.. సైన్స్ ఫిక్షన్

శిరీష్.. సైన్స్ ఫిక్షన్

అల్లు శిరీష్ హీరోగా ‘టైగర్’ సినిమా ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనుంది.

అల్లు శిరీష్ హీరోగా ‘టైగర్’ సినిమా ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. ‘శ్రీరస్తు శుభమస్తు’ తర్వాత మల్లిడి వేణు దర్శకత్వంలో చారిత్రక నేపథ్యమున్న సినిమా చేస్తున్నట్లు అల్లు శిరీష్ ప్రకటించారు. ఘనంగా ప్రారంభోత్సవం కూడా జరిగింది. అయితే ఈ సినిమాకి కాస్త టైమ్ పట్టేట్లు ఉందట. ఆ విషయం గురించి శిరీష్ మాట్లాడుతూ - ‘‘వేణుతో చేయాలనుకున్న సినిమా కథలో గ్రాఫిక్స్, యాక్షన్, సెట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ప్లానింగ్, ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్‌కి ఆరు నెలలు పడుతుంది.

 అందుకే, మధ్యలో మరో సినిమా చేయాలనుకున్నా’’ అన్నారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ దాదాపు పూర్తి కావచ్చింది. అందుకని శిరీష్‌తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారు వీఐ ఆనంద్. ‘‘నవంబర్‌లో షూటింగ్ మొదలుపెడతాం’’ అని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement