పిచ్చి పనులు మానుకోండి! | Abhishek Bachchan Lashes Out At A Fake Report Claiming He And His Wife Had a Fight | Sakshi
Sakshi News home page

పిచ్చి పనులు మానుకోండి!

Jul 24 2018 3:02 PM | Updated on Aug 20 2018 2:14 PM

Abhishek Bachchan Lashes Out At A Fake Report Claiming He And His Wife Had a Fight - Sakshi

పాపులారిటీ, రీడర్లను ఆకర్షించడం కోసం అసత్యాలు ప్రచారం చేస్తే సహించేది లేదని బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ఓ ప్రైవేట్‌ వెబ్‌సైట్‌ను హెచ్చరించారు. పారిస్‌ టూర్‌ ముగించుకుని ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అభిషేక్‌- ఐశ్వర్యలు తీవ్రంగా గొడవ పడ్డారంటూ సదరు వెబ్‌సైట్‌ కథనాన్ని రూపొందించడంతో పాటు.. ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో అభిషేక్‌ దృష్టికి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన అభిషేక్‌.. ‘ దయచేసి తప్పుడు కథనాలు ప్రచారం చేయడం మానుకోండి. ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త ద్వారా ప్రజలను ఆకర్షించాలనుకుంటారు కదా. ఒకవేళ అవి ఎవరికైనా ఉపయోగకరమైనవి అనుకుంటేనే ప్రచురించండి. అంతేతప్ప ఇలాంటి పిచ్చి పనులు చేయకండి’ అంటూ ట్వీట్‌ చేశాడు. అభిషేక్‌ హెచ్చరికతో స్పందించిన సదరు వెబ్‌సైట్‌ వెంటనే అభిషేక్‌- ఐశ్వర్యల వీడియోను డెలిట్‌ చేసింది.

వీడియోలో ఏముందంటే..
ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అనంతరం తన గారాల పట్టి ఆరాధ్య చేయి పట్టుకునేందుకు అభిషేక్‌ ప్రయత్నించగా.. చేతిని వెనక్కి లాక్కున్న ఆరాధ్య తల్లి ఐశ్వర్యను గట్టిగా హత్తుకుంది. ఐశ్వర్య కూడా ఆరాధ్య చేయి వదలకుండా అభిషేక్‌ వెనకాలే నడిచింది. ఆ సమయంలో అభిషేక్‌ కాస్త కోపంగా కనిపించడంతో.. ఇరువురి మధ్య తీవ్ర గొడవ జరిగిందంటూ సదరు వెబ్‌సైట్‌ వార్తలు ప్రచారం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement