రెండింతల థ్రిల్‌

Abhinetri 2 First Look release - Sakshi

ఎండలు మండిపోతున్నాయి. ఈ నెలలోనే ఇలా ఉంటే ఇక మే నెల ఎలా ఉంటుంది? ఎండలు రెండింతలు ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం చల్లని థియేటర్‌కి వెళితే బోలెడంత థ్రిల్‌కి గురి చేస్తారట ప్రభుదేవా, తమన్నా. కూల్‌ కూల్‌ అంటూ హాయిగా థియేటర్లో కూర్చుని మా థ్రిల్‌ని ఎంజాయ్‌ చేయండి అంటున్నారు. ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్‌ ముఖ్య తారలుగా రెండేళ్ల క్రితం వచ్చిన ‘అభినేత్రి’ గుర్తుందా? తమిళంలో ‘అభినేత్రి’గా తెలుగులో, ‘దేవి’గా విడుదలైంది. విజయ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే ‘అభినేత్రి 2 ’ రూపొందింది. 

ఫస్ట్‌ పార్ట్‌ కన్నా సీక్వెల్‌లో రెండింతల థ్రిల్‌ ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ట్రైడెంట్‌ ఆర్ట్స్, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకాలపై అభిషేక్‌ నామా, ఆర్‌. రవీంద్రన్‌ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభుదేవా, తమన్నాలతో పాటు నందితా శ్వేత, డింపుల్‌ హయాతి, కోవై సరళ కీలక పాత్రలు చేశారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 1న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘హారర్‌ కామెడీ జోనర్‌లో రూపొందిన ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచాలను చేరుకునే విధంగా సినిమా ఉంటుంది’’ అన్నారు అభిషేక్‌ నామా, ఆర్‌. రవీంద్రన్‌. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సి.ఎస్, సినిమాటోగ్రఫీ: అయాంకా బోస్, డైలాగ్స్‌: సత్య.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top