షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మార్షల్’

Abhay Marshal Movie Shooting Completed - Sakshi

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగా అభయ్ హీరోగా పరిచయమవుతొన్న చిత్రం ‘మార్షల్’. ఏ వి ఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది.

ఈ సందర్భంగా దర్శకుడు జై రాజ సింగ్‌ మాట్లాడుతూ 2019 లో విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, కొత్తగా ఉంటుందన్నారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశారని తెలిపారు. ఆర్.యం.స్వామి సినిమాటోగ్రఫీ, యాదగిరి వరికుప్పల సంగీతం ఎసెట్స్ గా నిలుస్థాయన్నారు.

నిర్మాత అభయ్ అడకా మాట్లాడుతూ మంచి మెసేజ్ ఉన్న వైవిద్యభరితమైన చిత్రం మార్షల్‌ అన్నారు.  ఈ సినిమా  అందరికీ నచ్చుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకువస్తామన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top