అట్టహాసంగా ‘మార్షల్‌’ ఆడియో ఆవిష్కరణ  | Abhay Marshal Movie Audio Function In Guntur | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా ‘మార్షల్‌’ చిత్ర ఆడియో ఆవిష్కరణ 

Aug 26 2019 5:35 PM | Updated on Aug 26 2019 5:39 PM

Abhay Marshal Movie Audio Function In Guntur - Sakshi

అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 19న విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో, టీజర్ అవిష్కరణ ఇటీవలే గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు హాజరై... ఆడియోను ఆవిష్కరించారు.

ఆడియో సీడీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ‘హీరో అభయ్ కథానాయకుడిగా.. నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించి... తన జన్మస్థలమైన గుంటూరులోనే ఆడియో ఆవిష్కరణ వేడుక జరుపుకోవడం ఎంతో సంతోషకరం. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’నని అన్నారు.  నిర్మాత, హీరో అభయ్ అడకా మాట్లాడుతూ ‘నేను పుట్టి పెరిగిన గుంటూరులో నా తొలిచిత్రం ఆడియో ఫంక్షన్‌ను ఇంత మంది పెద్దల సమక్షంలో చేయడం ఆనందంగా వుంది. ఇదో వైవిద్యభరితమైన చిత్రం. మార్షల్‌తో ఓ మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంద’ని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సినిమా అన్ని వర్గాల వారికి నచ్చేలా ఉంటుంది. నిర్మాత మరియు హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, నూతనంగా ఉంటుందని వివరించారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశార’ని చెప్పారు. 

‘కె జి ఎఫ్’  మ్యూజిక్ ఫేమ్ రవి బసురి తెలుగు సినిమా మార్షల్ సినిమా కంటెంట్  ప్రత్యేకంగా నచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ సినిమాలో రీ రికార్డింగ్ తో పాటు 2 పాటలను సమకూర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరి,  వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి,  పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, ముస్తఫా మరియు మద్దాల గిరి, బోనబోయిన శ్రీనివాసయాదవ్, నిమ్మకాయల రాజా నారాయణ, హీరోయిన్ మేఘా చౌదరి పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement