ఇక చాలు.. ఆపేయండి!

Aaradhya Bachchan Cute Counter To Paparazzi At Akash Ambani Reception - Sakshi

బీ టౌన్‌ స్టార్‌ కిడ్స్‌ తైమూర్‌ అలీఖాన్‌, అబ్‌రామ్‌ ఖాన్‌, ఆరాధ్య బచ్చన్‌, మిషా కపూర్‌లకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగే వేరు. వీరి ఫొటోలు షేర్‌ చేస్తే చాలు లక్షల్లో లైకులు వచ్చిపడతాయి. అందుకే ఈ చోటా సెలబ్రిటీలు కనబడగానే క్షణం ఆలస్యం చేయకుండా ఫొటోగ్రాఫర్లు కెమెరా కన్నును క్లిక్‌మనిపిస్తారు . ఇక పేరెంట్స్‌తో కలిసి బుల్లి స్టార్స్‌ కనబడితే పండుగ చేసుకునే పాపరాజీలు వివిధ భంగిమల్లో వారిని ఫొటోలో బంధించేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే ఈ తతంగమంతా బచ్చన్‌ల రాజకుమారి ఆరాధ్యకు విసుగు తెప్పించింది. మాటిమాటికీ ఫోజులివ్వమని అడగటమే కాకుండా వెనుక నుంచి కూడా తనను ఫొటోలు తీయడానికి ప్రయత్నించడంతో ఫొటోగ్రాఫర్లకు క్యూట్‌ కౌంటర్‌ ఇచ్చింది.

అసలు విషమయేమిటంటే.. ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ- శ్లోకా మెహతాల వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రముఖులు, క్రీడా దిగ్గజాలు సహా దాదాపు బాలీవుడ్‌ తారగణమంతా తరలి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి రిసెప్షన్‌ వేడుకకు తల్లిదండ్రులు ఐశ్వర్య-అభిషేక్‌ బచ్చన్‌లతో కలిసి ఆరాధ్య బచ్చన్‌ కూడా హాజరైంది. ఇందులో భాగంగా ఫొటోలు దిగే క్రమంలో నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అయితే పదే పదే సేమ్‌ పొజిషన్‌లో ఉండాలని చెప్పడం, స్టేజ్‌ దిగుతున్న క్రమంలో కూడా ఫొటోలు తీయడంతో చిర్రెత్తుకొచ్చిన ఆరాధ్య..  ‘ఇక చాలు.. ఆపేయండి’ అంటూ ఫొటోగ్రాఫర్లకు స్వీట్‌ షాక్‌ ఇచ్చింది. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌​ చేస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top