ఖాన్‌ల దోస్తీ కట్! | Aamir-Salman friends no more? | Sakshi
Sakshi News home page

ఖాన్‌ల దోస్తీ కట్!

Oct 25 2015 2:46 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఖాన్‌ల దోస్తీ కట్! - Sakshi

ఖాన్‌ల దోస్తీ కట్!

బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్ చాలామంచి స్నేహితులు.. కానీ ఇదొకప్పటి మాట. ఇప్పుడు వారి మధ్య విభేదాలు వచ్చాయి.

బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్ చాలామంచి స్నేహితులు.. కానీ ఇదొకప్పటి మాట. ఇప్పుడు వారి మధ్య విభేదాలు వచ్చాయి. వారి స్నేహబంధమూ బీటలు వారినట్టు కనిపిస్తున్నది. ఒకప్పుడు తమ స్నేహానికి సాటిలేదన్నట్టుగా జాన్ జిగిరీగా ఉన్న ఈ సూపర్ స్టార్ల మధ్య విభేదాలకు కారణం 'బజరంగీ భాయ్‌జాన్'. కొన్ని నెలల కిందట విడుదలై భారీ వసూళ్ల సాధించిన ఈ సినిమాను మొదట తనకే ఆఫర్ చేశారని, తాను చేయలేకపోవడంతో 'బజరంగీ భాయ్‌జాన్' నిర్మాతలను సల్మాన్ వద్దకు పంపినట్టు అమీర్ పబ్లిక్‌గా ప్రకటించారు. ఈ ప్రకటన సల్మాన్‌ను నొప్పించిందట.

'తాము తిరస్కరించిన పాత్రల గురించి పబ్లిక్‌గా మాట్లాడకూడదనే అలిఖిత నిబంధన బాలీవుడ్ అగ్ర హీరోల నడుమ ఉంది. మున్నాభాయ్ పాత్ర మొదట తనకే వచ్చిందని షారుఖ్ ఎప్పుడైనా చెప్పారా? 'లాగాన్' సినిమాను తిరస్కరించినట్టు అభిషేక్ బచ్చన్ ఎప్పుడైనా నోరువిప్పారా?' అంటూ ఈ విషయంలో అమీర్ గీత దాటాడని సల్మాన్ భావిస్తున్నట్టు ఆయన సన్నిహితుడొకరు తెలిపారు.

దానికితోడు అమీర్, సల్మాన్ ప్రస్తుతం రెజింగ్ నేపథ్యంగా సినిమాలను చేస్తుండటం కూడా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచిందని చెప్తున్నారు. 'నువ్వు చేస్తున్న సినిమాలో కొన్ని మార్పులు చేసి.. లోకేషన్‌ను మార్చు అని సల్మాన్‌ను అమీర్ కోరారు. అయితే తాను ఎలాంటి మార్పులు చేయబోనని కథ రాసిని ప్రకారమే తెరకెక్కిస్తామని సల్మాన్ స్పష్టం చేశారు. దీంతో ఇద్దరి మధ్య పోటీ వాతావరణం నెలకొంది' అని సన్నిహితవర్గాలు చెప్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement