‘అప్పుడే కిరణ్‌తో ప్రేమలో పడిపోయా’ | Aamir Khan Talks About His Love Story With Kiran Rao | Sakshi
Sakshi News home page

‘అప్పుడే కిరణ్‌తో ప్రేమలో పడిపోయా’

Aug 15 2018 8:05 PM | Updated on Aug 15 2018 8:11 PM

Aamir Khan Talks About His Love Story With Kiran Rao - Sakshi

తన మాజీ భార్య రీనా దత్తా అంటే తనకెంతో గౌరవం ఉందని...

విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకునే బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ సినిమాలకు ఇండియాతో పాటు, చైనాలో కూడా మంచి మార్కెట్‌ ఉన్న విషయం తెలిసిందే‌. ఆయన నటించిన పీకే, దబాంగ్‌ వంటి సినిమాలు చైనా బాక్సాఫీస్‌ను కూడా బద్దలుగొట్టాయి. దీంతో చైనా ఫ్యాన్స్‌కు ఆమిర్‌తో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అయితే పర్సనల్‌ విషయాలను ఎక్కువగా షేర్‌ చేసుకోని ఆమిర్‌ ఓ చైనీస్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రీనా అంటే ఎంతో గౌరవం ఉంది..
తన వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడిన ఆమిర్‌.. తన మాజీ భార్య రీనా దత్తా అంటే తనకెంతో గౌరవం ఉందని, ఇప్పటికీ తమ మధ్య మంచి స్నేహ బంధం ఉందని తెలిపారు. ఆమెతో కలిసి పానీ ఫౌండేషన్‌ కార్యక్రమంలో‌ పాల్గొంటున్నానన్నారు.  రీనాతో విడాకులు తీసుకున్న మూడేళ్ల తర్వాత కిరణ్‌ రావు తన జీవితంలోకి వచ్చిందంటూ తన ప్రేమ కథను చెప్పుకొచ్చారు.

తను లేని నా జీవితాన్ని ఊహించడం కష్టం...
‘లగాన్‌ సినిమా సమయంలో కిరణ్‌ని కలిశాను. అప్పటికీ తనొక అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మాత్రమే నాకు తెలుసు. కానీ ఒకరోజు సడన్‌గా కిరణ్‌ నుంచి కాల్‌ వచ్చింది. సినిమాకు సంబంధించి ఏవేవో కొన్ని విషయాలు మాట్లాడింది. అప్పటి వరకు తనతో స్నేహం కూడా లేదు. కానీ ఎందుకో తను ఫోన్‌ కట్‌ చేయగానే ఆత్మీయురాల్ని మిస్‌ అయిన ఫీలింగ్‌. అందుకే అప్పటి నుంచి తనతో మాట్లాడేందుకు ఎదురుచూసే వాణ్ణి. తనతో మాట్లాడిన ప్రతీసారి ఎంతో సంతోషంగా ఉండేది. ఆ క్రమంలో తనతో ఎప్పుడు ప్రేమలో పడిపోయానో నాకే తెలియదు. అందుకే తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. 2005లో మా వివాహం జరిగింది. తనులేని నా జీవితం ఊహించడం ఎంతో కష్టం’  అంటూ ఆమిర్‌ చిరునవ్వులు చిందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement