నయా లుక్‌ | Aamir Khan Starrer Thugs Of Hindostan To Release 6 Motion Posters | Sakshi
Sakshi News home page

నయా లుక్‌

Sep 16 2018 12:52 AM | Updated on Sep 16 2018 12:52 AM

Aamir Khan Starrer Thugs Of Hindostan To Release 6 Motion Posters - Sakshi

ఆమిర్‌ ఖాన్

ఇక్కడున్న ఫొటో చూశారుగా.. హీరో ఆమిర్‌ఖాన్‌ 1980 నాటి సిగార్‌ను నోట్లో పెట్టుకుని ఎలా దర్జాగా కూర్చున్నారో. ఇది ‘థగ్స్‌ ఆఫ్‌ హిందోస్తాన్‌’ సినిమా కోసమే. విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్, ఆమిర్‌ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్‌ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ఇది. ఫిలిప్‌ మెడోస్‌ టేలర్‌ రాసిన ‘కన్ఫెషన్స్‌ ఆఫ్‌ ఏ థగ్‌’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో ఆమిర్‌ ఖాన్‌ లుక్‌ను కత్రినా కైఫ్‌ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. అలాగే ఇకనుంచి సినిమాలో కీలక తారాగణానికి సంబంధించిన లుక్స్‌ని వారానికి ఒకటి విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్‌లో విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement