రికార్డు స్థాయి లొకేషన్లు | Aamir Khan to shoot Lal Singh Chadha in 100 real locations | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయి లొకేషన్లు

Sep 20 2019 3:30 AM | Updated on Sep 20 2019 3:30 AM

Aamir Khan to shoot Lal Singh Chadha in 100 real locations - Sakshi

ఆమిర్‌ ఖాన్‌ సినిమా అంటే రికార్డ్‌ స్థాయి కలెక్షన్లు సాధారణం. కానీ ఆమిర్‌ నటించబోయే కొత్త సినిమాను రికార్డ్‌ స్థాయి లొకేషన్లలో చిత్రీకరించాలనుకుంటున్నారని తెలిసింది. 1994లో టామ్‌ హ్యాంక్స్‌ నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ ఆధారంగా ‘లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమా చేస్తున్నారు ఆమిర్‌. అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. ఈ సినిమాలోని పాత్ర కోసం బరువు తగ్గే పనిలో ఉన్నారు ఆమిర్‌ ఖాన్‌.

నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 100కుపైగా లొకేషన్లలో ఈ సినిమాను చిత్రీకరిస్తారట. ఢిల్లీ, గుజరాత్, ముంబై, కోల్‌కత్తా, బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు మరిన్ని లొకేషన్లు కోసం వెతుకుతున్నారట. ఇన్ని లొకేషన్లలో ఇప్పటి వరకూ ఏ బాలీవుడ్‌ సినిమా కూడా చిత్రీకరణ జరుపుకోలేదట. ఈ సినిమాలో కరీనా కపూర్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement