డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఆమిర్‌ కూతురు!

Aamir Khan Daughter Make Her Directorial Debut With Theatres - Sakshi

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్ ఖాన్‌ ముద్దుల తనయ ఇరా ఖాన్‌ ఇండస్ట్రీ ఎంట్రీ ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే అందరు స్టార్‌ కిడ్స్‌ మాదిరి తను హీరోయిన్‌గా కాకుండా డైరెక్టర్‌గా తన అదృష్టం పరీక్షించుకోనున్నట్లు సమాచారం. ఓ థియేటర్‌ డ్రామా దర్శకురాలిగా ఆమె మెగాఫోన్‌ పట్టనున్నారని ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. దీనికి ‘యూరిపైడ్స్‌మిడియా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని, దీనిని భారతదేశంలోని ఎంపిక చేయబడిన పట్టణాలలో ప్రదర్శిస్తారని తెలిపాడు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభమయ్యాయని..డిసెంబరు నాటికి ఈ నాటకం ప్రేక్షకుల ముందుకు రానుందని పేర్కొన్నాడు. ఇక కొంతకాలంగా ఫోటోషూట్‌లతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఇరా తన డ్రెస్సింగ్‌ కారణంగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

కాగా ఇరా.. ఆమిర్‌- అతడి మొదటి భార్య రీనా దత్తాల మలి సంతానం. ఆమె ప్రస్తుతం తన అన్న జునైద్‌ ఖాన్‌, తల్లి రీనాలతో కలిసి జీవిస్తున్నారు. ఆమిర్‌-రీనా విడాకులు తీసుకున్నప్పటికీ స్నేహితుల్లా మెలుగుతున్నారన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ నీటి పొదుపు ఆవశ్యకతను ప్రచారం చేస్తున్నారు. ఇక తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘లగాన్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కిరణ్‌రావుతో ప్రేమలో పడిన ఆమిర్‌... ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఆజాద్‌ అనే కుమారుడు ఉన్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top