‘కాలా’పై ఆమిర్‌ఖాన్‌ వ్యాఖ్యలు | Aamir Khan Comment On Rajinikanth Kaala Movie | Sakshi
Sakshi News home page

Jun 7 2018 11:01 AM | Updated on Oct 22 2018 6:10 PM

Aamir Khan Comment On Rajinikanth Kaala Movie - Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘కాలా’ థియేటర్స్‌లోకి వచ్చేసింది. తలైవా సినిమా వస్తోందంటే అభిమానులకే కాదు సెలబ్రెటీలకు కూడా పండుగే. ఎందుకంటే రజనీ సూపర్‌స్టార్స్‌కే సూపర్‌స్టార్స్‌. రజనీ సినిమాకు ఏరియాలతో పని ఉండదు. తెరపై రజనీ బొమ్మ కనబడితే చాలు. అందుకే రజనీ సినిమాకు ఇండియావైడ్‌ క్రేజ్‌ ఉంటుంది. 

తాజాగా బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ కాలా సినిమాపై  కామెంట్‌ చేశారు. ‘రజనీకి వీరాభిమానినైన నేను కాలా సినిమాను చూడటానికి ఇక ఎదురుచూడలేను’ అంటూ రజనీపై తన ప్రేమను సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. హ్యూమా ఖురేషి, ఈశ్వరీ రావు, నానా పటేకర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను హీరో ధనుష్‌ నిర్మించారు. కబాలి ఫేం పా రంజిత్‌ దర్శకత్వం వహించారు. 

Advertisement
 
Advertisement
Advertisement