అనుకోకుండా కలిశారు

Aamir Khan and Telugu superstar Chiranjeevi meet in Japan - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఆమిర్‌ ఖాన్‌ అనుకోకుండా జపాన్‌లో కలుసుకున్నారు. ‘సైరా’ షూటింగ్‌కి కాస్త గ్యాప్‌ దొరకడంతో సతీమణి సురేఖతో కలిసి జపాన్‌  వెళ్లారు చిరంజీవి. హాలీడే ఎంజాయ్‌ చేసి అక్కడి నుంచి తిరిగి వస్తుండగా టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో అమిర్‌ ఖాన్‌ను కలుసుకున్నారు. ఆ సందర్భంలో దిగిన ఫొటో ఇది. ‘‘నా అభిమాన నటుడు చిరంజీవిగారిని అనుకోకుండా కలుసుకున్నాను.

ఆయన చేస్తున్న స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా గురించి మాట్లాడుకున్నాం. మీరెప్పుడూ మాకు స్ఫూర్తిని ఇస్తుంటారు సార్‌’’ అని ట్వీటర్‌లో షేర్‌ చేసుకున్నారు ఆమిర్‌. ‘‘ఆమిర్‌ లాంటి అద్భుతమైన నటుడిని కలుసుకోవడం హ్యాపీగానూ, సర్‌ప్రైజింగ్‌గానూ ఉంది. హాలీడే ముగిసింది. ‘సైరా’ కోసం తిరిగి హైదరాబాద్‌ వస్తున్నాను’’ అన్నారు చిరంజీవి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top