గౌతమ్కు మహేష్ నుంచి అరుదైన బర్త్డే గిఫ్ట్

గౌతమ్కు మహేష్ నుంచి అరుదైన బర్త్డే గిఫ్ట్ - Sakshi


గత సంవత్సరం పుట్టినరోజుకు తన కొడుకు గౌతమ్ కృష్ణకు కోటి రూపాయలకు పైగా విలువగల క్రూయిజర్ కారును బహుమతిగా ఇచ్చిన మహేష్ బాబు.. ఈసారి అంతకంటే మరింత విలువైన బహుమతిని సిద్ధం చేస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'ఆగడు' ఆడియో విడుదల కార్యక్రమాన్ని కొడుకు పుట్టినరోజు నాడే ఏర్పాటు చేయిస్తున్నాడు. మహేష్ బాబు పుట్టిన రోజు అయిన ఆగస్టు 9వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదల అవుతోంది. ఆగస్టు 31 గౌతమ్ పుట్టిన రోజు. 1.. నేనొక్కడినే సినిమాతో తెరంగేట్రం కూడా చేసేసిన గౌతమ్ కృష్ణకు ఇది చాలా అపురూపమైన బహుమతి అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏ కొడుకూ ఊహించలేని అద్భుతమైన గిఫ్టును మహేష్ ఇస్తున్నాడు.ఇక సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ 50వ చిత్రంగా ఆగడు వస్తోంది. ఈ సినిమా పాటలను తమన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి అదరగొట్టాడని సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. అందులో ఆమె బికినీలో కనిపిస్తుందని కూడా ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది. దాదాపు నాలుగు నిమిషాల పాటు ఉండే ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్ అవుతుందంటున్నారు.


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top