ఆది@ అథ్లెట్‌

aadi pinsetti new movie updates - Sakshi

వైవిధ్యమైన పాత్రలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి తొలిసారి క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రంతో పృథ్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బిగ్‌ ప్రింట్‌ పిక్చర్స్‌ పతాకంపై ఐబీ కార్తికేయన్‌ నిర్మించనున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనుంది. పృథ్వి ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఈ కథను రాసుకుంటున్నంత సేపు నా మనసులో ఆదిగారే మెదిలారు. కథ విన్న ఆయన చేస్తానని చెప్పగానే నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది.

ఆయనతో పని చేయడానికి ఉత్సాహంగా ఉంది. అథ్లెటిక్స్‌ (క్రీడాకారులు)కు సంబంధించిన కథ ఇది. తన కలను సాకారం చేసుకోవడానికి కథానాయకుడు చేసిన ప్రయత్నం ఏంటనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నాం. త్వరలోనే ఇతర వివరాలు చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పీఎంఎం ఫిల్మ్స్, జి.మనోజ్, జి. శ్రీహర్ష (కట్స్‌ అండ్‌ గ్లోరీ స్టూడియోస్‌), కెమెరా: ప్రవీణ్‌ కుమార్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top