తమిళ ‘ఆర్‌ఎక్స్‌ 100’లో ఆది! | Aadhi Pinisetty In RX 100 Tamil Remake | Sakshi
Sakshi News home page

Aug 12 2018 1:59 PM | Updated on Jul 14 2019 1:28 PM

Aadhi Pinisetty In RX 100 Tamil Remake - Sakshi

హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారన్న వార్త ప్రస్తుతం వైరల్‌

బోల్డ్‌ కంటెంట్‌తో భారీ హిట్‌లు కొడుతున్నారు నూతన దర్శకులు. ఒక్క సినిమాతోనే మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌లోకి వెళ్తున్నారు. అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100 సినిమాలతో సందీప్‌ రెడ్డి వంగా, అజయ్‌ భూపతి తమ స్టామినా ఏంటో నిరూపించారు. ఈ రెండు సినిమాలు టాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే అర్జున్‌రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. 

ఇక ఆర్‌ ఎక్స్‌ 100 మూవీని కూడా తమిళ్‌లో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోగా ఆది పినిశెట్టి నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు దర్శకుడు, ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారన్న వార్త ప్రస్తుతం వైరల్‌ గా మారింది. ఎందుకంటే ఆర్‌ఎక్స్‌ 100తో పాయల్‌ రాజ్‌పుత్‌ తెలుగునాట పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement