అమితాబ్ అతిధిగా 'కొచ్చడయాన్' ప్రత్యేక షో! | A special curtain raiser event of Rajinikanth Sir's Kochadaiiyaan | Sakshi
Sakshi News home page

అమితాబ్ అతిధిగా 'కొచ్చడయాన్' ప్రత్యేక షో!

Mar 30 2014 3:37 PM | Updated on Sep 2 2017 5:22 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కొచ్చడయాన్' చిత్రంపై ముంబైలో ఆదివారం సాయంత్రం ఓ ప్రత్యేక షోను నిర్వహించనున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కొచ్చడయాన్' చిత్రంపై ముంబైలో ఆదివారం సాయంత్రం ఓ ప్రత్యేక షోను నిర్వహించనున్నారు. రజనీ సర్ నటించిన 'కొచ్చడయాన్'పై ప్రత్యేకమైన కర్టైన్ రైజర్ కార్యక్రమం ఉంది అని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ముఖ్య అతిధిగా హాజరవ్వనున్నారు. 
 
తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఈ చిత్రంలో రజనీ సరసన దీపికా పదుకొనె జాకీ ష్రాఫ్, శరత్‌కుమార్, శోభన, ఆది తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. కొచ్చడయాన్ చిత్రానికి ఎ.ఆర్. రహమాన్ పాటలు స్వరపరిచారు. 
Advertisement
 
Advertisement
Advertisement