శ్యామ్‌గోపాల్ వర్మ సినిమా ఇది..! | A Shyam Gopal Varma Film' With Shafi As The Lead | Sakshi
Sakshi News home page

శ్యామ్‌గోపాల్ వర్మ సినిమా ఇది..!

Nov 24 2013 1:10 AM | Updated on Sep 2 2017 12:54 AM

శ్యామ్‌గోపాల్ వర్మ సినిమా ఇది..!

శ్యామ్‌గోపాల్ వర్మ సినిమా ఇది..!

ఈ చిత్రంలో హీరో సినీ దర్శకుడు. హింస ప్రధానంగా సినిమాలు నిర్మించే ఈ దర్శకుడు చివరకు వాటి ద్వారా ఏం పొందాడు? ఏం పోగొట్టుకున్నాడు? అనేది కథాంశం.

‘‘ఈ చిత్రంలో హీరో సినీ దర్శకుడు. హింస ప్రధానంగా సినిమాలు నిర్మించే ఈ దర్శకుడు చివరకు వాటి ద్వారా ఏం పొందాడు? ఏం పోగొట్టుకున్నాడు? అనేది కథాంశం. ఇది సెటైరికల్ థ్రిల్లర్’’ అని దర్శకుడు రాకేష్ శ్రీనివాస్ చెప్పారు. ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’ పేరుతో సమిష్టి క్రియేషన్స్ పతాకంపై విజయ్‌కుమార్‌రాజు, రాకేష్ శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ‘నా సినిమా నా ఇష్టం’ అనేది ఉపశీర్షిక. షఫీ ప్రధాన పాత్రధారి. జోయాఖాన్ కథానాయిక. ముహూర్తపు దృశ్యానికి దర్శకుడు వివేక్‌కృష్ణ కెమెరా స్విచాన్ చేయగా, ప్రొడక్షన్ డిజైనర్ సుబ్బారెడ్డి క్లాప్ ఇచ్చారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘మంచి చిత్రాలను అందించాలనే తపనతో ఈ సంస్థ స్థాపించాం. వచ్చే నెల తొలివారంలో షూటింగ్ ప్రారంభించి, వేసవిలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. వినూత్న కథలో కీలక పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉందని షఫి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ‘మంత్ర’ ఆనంద్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, ఆర్ట్: పార్థసారథివర్మ.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement