breaking news
Shyam Gopal Varma
-
వర్మగా షఫీ ఒదిగిపోయాడు!
షఫీ కీలక పాత్రలో వి. విజయకుమార్ రాజు నిర్మించిన చిత్రం ‘ఎ శ్యామ్గోపాల్వర్మ ఫిల్మ్’. ‘నా సినిమా నా ఇష్టం’ అనేది ఉపశీర్షిక. రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. చిత్రవిశేషాలను దర్శకుడు తెలియజేస్తూ -‘‘రక్తపాతం, హింస ప్రధానాంశాలుగా చేసుకుని సినిమాలు రూపొందించే ఓ దర్శకుడు ఎలాంటి ఫలితం అనుభవించాడు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. శ్యామ్గోపాల్ వర్మ పాత్రలో షఫీ అద్భుతంగా ఒదిగిపోయాడు’’ అన్నారు. తొలి ప్రయత్నంగా నిర్మించిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత తెలిపారు. నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర సంగీతదర్శకుడు ‘మంత్ర’ ఆనంద్ చెప్పారు. ఈ చిత్రకథ సహజత్వానికి దగ్గరగా ఉంటుందని షఫీ అన్నారు. -
శ్యామ్గోపాల్ వర్మ సినిమా ఇది..!
‘‘ఈ చిత్రంలో హీరో సినీ దర్శకుడు. హింస ప్రధానంగా సినిమాలు నిర్మించే ఈ దర్శకుడు చివరకు వాటి ద్వారా ఏం పొందాడు? ఏం పోగొట్టుకున్నాడు? అనేది కథాంశం. ఇది సెటైరికల్ థ్రిల్లర్’’ అని దర్శకుడు రాకేష్ శ్రీనివాస్ చెప్పారు. ‘ఎ శ్యామ్గోపాల్వర్మ ఫిల్మ్’ పేరుతో సమిష్టి క్రియేషన్స్ పతాకంపై విజయ్కుమార్రాజు, రాకేష్ శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్లో మొదలైంది. ‘నా సినిమా నా ఇష్టం’ అనేది ఉపశీర్షిక. షఫీ ప్రధాన పాత్రధారి. జోయాఖాన్ కథానాయిక. ముహూర్తపు దృశ్యానికి దర్శకుడు వివేక్కృష్ణ కెమెరా స్విచాన్ చేయగా, ప్రొడక్షన్ డిజైనర్ సుబ్బారెడ్డి క్లాప్ ఇచ్చారు. నిర్మాత మాట్లాడుతూ-‘‘మంచి చిత్రాలను అందించాలనే తపనతో ఈ సంస్థ స్థాపించాం. వచ్చే నెల తొలివారంలో షూటింగ్ ప్రారంభించి, వేసవిలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. వినూత్న కథలో కీలక పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉందని షఫి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ‘మంత్ర’ ఆనంద్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, ఆర్ట్: పార్థసారథివర్మ.