వర్మగా షఫీ ఒదిగిపోయాడు! | Na Cinema Naa Ishtam movie reday for releases | Sakshi
Sakshi News home page

వర్మగా షఫీ ఒదిగిపోయాడు!

Sep 1 2014 11:53 PM | Updated on Sep 2 2017 12:43 PM

వర్మగా షఫీ ఒదిగిపోయాడు!

వర్మగా షఫీ ఒదిగిపోయాడు!

షఫీ కీలక పాత్రలో వి. విజయకుమార్ రాజు నిర్మించిన చిత్రం ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’. ‘నా సినిమా నా ఇష్టం’ అనేది ఉపశీర్షిక. రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన

 షఫీ కీలక పాత్రలో వి. విజయకుమార్ రాజు నిర్మించిన చిత్రం ‘ఎ శ్యామ్‌గోపాల్‌వర్మ ఫిల్మ్’. ‘నా సినిమా నా ఇష్టం’ అనేది ఉపశీర్షిక. రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. చిత్రవిశేషాలను దర్శకుడు తెలియజేస్తూ -‘‘రక్తపాతం, హింస ప్రధానాంశాలుగా చేసుకుని సినిమాలు రూపొందించే ఓ దర్శకుడు ఎలాంటి ఫలితం అనుభవించాడు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. శ్యామ్‌గోపాల్ వర్మ పాత్రలో షఫీ అద్భుతంగా ఒదిగిపోయాడు’’ అన్నారు. తొలి ప్రయత్నంగా నిర్మించిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత తెలిపారు. నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర సంగీతదర్శకుడు ‘మంత్ర’ ఆనంద్ చెప్పారు. ఈ చిత్రకథ సహజత్వానికి దగ్గరగా ఉంటుందని షఫీ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement