మాటల్లేవ్‌! | 96 movie teaser release | Sakshi
Sakshi News home page

మాటల్లేవ్‌!

Jul 14 2018 4:35 AM | Updated on Jul 14 2018 4:35 AM

96 movie teaser release - Sakshi

త్రిష, విజయ్‌ సేతుపతి

ఒక్క డైలాగ్‌ కూడా లేదు.. దాదాపు 82 సెకన్ల టీజర్‌లో. కానీ ప్రేమ, మౌనం, ఆశ్చర్యం, బాధ.. ఇలా అన్ని ఎమోషన్స్‌ కనిపించాయి. అవును... మాట్లాడుకోవడానికి భాష కావాలి కానీ ప్రేమించుకోవడానికి ఎందుకు? త్రిష, విజయ్‌ సేతుపతి జంటగా తమిళంలో రూపొందుతోన్న చిత్రం ‘96’. ఈ సినిమాతో కెమెరామెన్‌ ప్రేమ్‌కుమార్‌ దర్శకునిగా మారారు.

లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో విజయ్‌సేతుపతి ఫొటోగ్రాఫర్‌గా, త్రిష టీచర్‌ పాత్రలో నటించారట. లేటెస్ట్‌గా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో సింగిల్‌ డైలాగ్‌ కూడా లేకపోవడం విశేషం. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ లవ్‌సాంగ్‌ వినిపిస్తోంది. టీజర్‌లో విజయ్‌ సేతుపతి డిఫరెంట్‌ డ్రెస్సెస్‌లో కనిపిస్తే త్రిష మాత్రం ఓన్లీ సింగిల్‌ డ్రెస్‌లోనే కనిపిస్తారు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement