చిరు ఇంట్లో అలనాటి తారల సందడి

1980s South Stars Reunion At Chiranjeevi Home - Sakshi

దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన 80వ దశకపు తారలంతా ప్రతి ఏటా ఏదో ఒకచోట చేరి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి రీయూనియన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ఇల్లు వేదికైంది. ఇందుకోసం చిరంజీవి తన ఇంట్లో అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అలనాటి ప్రముఖ నటీనటులు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ వేడుకలో రాధిక, శరత్‌కుమార్‌, ప్రభు, భానుచందర్‌, మోహన్‌లాల్‌, రెహమాన్‌, వెంకటేశ్‌, సరిత, లిజీ, సుభాషిణితో పాటు పలువురు తారలు పాల్గొన్నారు. 

ఈ వేడుకలో చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అలాగే రాధిక శరత్‌కుమార్‌ కూడా తన తోటి తారలతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 80వ దశకపు తారలు అందరు ఇలా రీయూనియన్‌ కావడం ఇది పదోసారి. అప్పట్లో తీరిక లేకుండా గడిపిన వీరంతా ఇలా ఒకచోట చేరి సందడి చేస్తున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top